ETV Bharat / international

మెజారిటీ కోల్పోయిన ఓలీ సర్కారు

author img

By

Published : May 5, 2021, 10:56 PM IST

నేపాల్​లో ప్రధాని ఓలీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు పుష్ప కమల్‌ దహల్‌. దీంతో ఓలీ శర్మ నేతృత్వంలోని సీపీఎన్​-యూఎంఎల్​ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.

Oli government
ఓలీ సర్కారు

నేపాల్‌లో మరోసారి ప్రధానమంత్రి కేపీ ఓలీ శర్మ నేతృత్వంలోని సీపీఎన్​-యూఎంఎల్​ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. సీపీఎన్​ మావోయిస్ట్‌ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఆ దేశ ప్రతినిధుల సభలో ఓలీ శర్మ మెజారిటీ కోల్పోయారు. ఈ మేరకు మద్దతు ఉపసంహరణ లేఖను పార్లమెంట్‌ సెక్రటేరియట్‌కు లేఖ పంపింది సీపీఎన్​ఎం.

ఓలీ శర్మ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ.. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారారని సీపీఎన్​ఎం చీఫ్​ విప్‌ దేవ్ గురుంగ్ ఆరోపించారు. నేపాల్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మే 10న విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు ఓలీ ప్రకటించిన రెండు రోజుల తర్వాత సీపీఎన్​ఎం మద్దతు ఉపసంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

275 స్థానాలున్న నేపాల్ పార్లమెంట్‌లో ఓలీ పార్టీ సీపీఎన్​-యూఎంఎల్​కు 121 సీట్లు ఉండగా సీపీఎన్​ఎంకు 49 మంది చట్ట సభ్యులున్నారు.

ఇదీ చూడండి: ఓలీ సర్కారు కూలిపోక తప్పదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.