ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4,74,61,740కి చేరింది. 12,13,568మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 3,41,12,441మంది కరోనాను జయించారు.
దేశం | కేసులు | మృతులు |
అమెరికా | 95,70,921 | 2,37,031 |
బ్రెజిల్ | 55,54,206 | 1,60,272 |
రష్యా | 16,73,686 | 28,828 |
ఫ్రాన్స్ | 14,66,433 | 37,435 |
స్పెయిన్ | 13,13,087 | 36,257 |
అర్జెంటీనా | 11,83,131 | 31,623 |
కొలంబియా | 10,93,256 | 31,670 |
బ్రిటన్ | 10,53,864 | 46,853 |
మెక్సికో | 9,33,155 | 92,100 |
నేపాల్లో..
నేపాల్లో మరణాల సంఖ్య తాజాగా 1000 దాటింది. ఇవాళ 20మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మృతుల సంఖ్య 1,004కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 1,79,614కు పెరిగింది.
అయితే కరోనా సంక్షోభం వల్ల నేపాల్ ఆర్థికపరంగా చిన్నాభిన్నమైంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగింది ఆ దేశ ప్రభుత్వం. దాదాపు 7 నెలల తర్వాత.. హిమాలయ పర్వతాల్లో సాహస యాత్రలకు అనుమతినిచ్చింది.
ఇదీ చూడండి:- కొవిడ్ రికవరీల్లో భారత్యే టాప్.!
శ్రీలంకలో..
శ్రీలంకలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల పునరుద్ధరణ ప్రక్రియను మరో రెండు వారాల పాటు వాయిదా వేసింది అక్కడి ప్రభుత్వం.
పశ్చిమ ప్రావిన్సులో కొత్త క్లస్టర్లు ఏర్పడటం వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత నెలలో స్కూళ్లను మూసివేశారు.
పాకిస్థాన్ పరిస్థితి..
మరోమారు లాక్డౌన్ విధించే స్థితిలో పాకిస్థాన్ లేదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలు పాటించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రన్ఖాన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేసింగ్, టెస్టింగ్, క్వారంటైన్ ప్రక్రియను కఠినతరం చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- కరోనా టీకా వేయించుకున్న యూఏఈ ప్రధాని