ETV Bharat / international

నేపాలీ పర్వతారోహకుడి ప్రపంచ రికార్డు - ఎవరెస్ట్​

నేపాల్​కు చెందిన ఓ మౌంటెన్​ గైడ్​ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు రోజుల్లో రెండు సార్లు ఎవరెస్టు​ను అధిరోహించినట్లు నిర్వహకులు తెలిపారు. మరోవైపు ఎవరెస్టును అధిరోహించే క్రమంలో ఇద్దరు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు.

Everest
ఎవరెస్ట్​
author img

By

Published : May 14, 2021, 6:23 AM IST

మింగ్మా తెంజింగ్​ శెర్పా.. నేపాల్​కు చెందిన 43ఏళ్ల ఈ మౌంటెన్​ గైడ్​ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టును తక్కువ వ్యవధిలో రెండుసార్లు ఈయన అధిరోహించి రికార్డు సృష్టించాడు.

తూర్పు నేపాల్​లోని సంకువాసభ జిల్లాకు చెందిన శెర్పా మొదట రోప్​ ఫిక్సింగ్​ టీం సభ్యుడిగా మే 7వ తేదీ ఉదయం ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరాడు. మళఅలీ మే 11వ తేదీ ఉదయం మరోమారు ఈ ఘనత సాధించాడు. ఈ యాత్రను ఏర్పాటు చేసిన 'సెవెన్​ సమ్మిట్​ ట్రెక్స్​' ట్రావెల్​ ఏజెన్సీకి శెర్పా అధ్యక్షుడు కూడా. రెండోసారి మహమ్మద్​ అల్​ ఖలీఫా నేతృత్వంలోని 16 మంది సభ్యుల బృందానికి మౌంటెన్​ గైడ్​గా వెళ్లి శెర్పా ఎవరెస్టు అధిరోహించాడు.

ఎవరెస్టు శిఖరంపై ఇద్దరు పర్వతారోహకుల మృతి

ఎవరెస్టును అధిరోహించే క్రమంలో ఇద్దరు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను స్విట్జర్లాండ్‌కు చెందిన అబ్దుల్‌ వారియాక్‌ (41), అమెరికాకు చెందిన పువెయి్ లియు (55)గా గుర్తించారు. అబ్దుల్‌ విజయవంతంగా పర్వత శిఖరాన్ని చేరుకోగలిగారని, అయితే తిరుగు ప్రయాణంలో ఇబ్బందులకు గురయ్యారని ఈ సాహసయాత్రను నిర్వహించిన 'సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌' అధికారి ఛాంగ్‌ దావా తెలిపారు.

ఇద్దరు సహాయకులను పంపినా అబ్దుల్‌ ప్రాణాలను కాపాడలేకపోయామని పేర్కొన్నారు. లియు మాత్రం శిఖరాగ్రాన్ని చేరే క్రమంలో చనిపోయారని తెలిపారు. "శిఖరాగ్రానికి చేరువలోని హిల్లరీ స్టెప్‌ అనే ప్రాంతానికి ఆయన వెళ్లారు. ప్రతికూల వాతావరణం, అలసట కారణంగా వెనుదిరిగి, 'సౌత్‌ కోల్‌'కు వచ్చారు. సహాయ సిబ్బంది సాయంతో ఆయన్ను సౌత్‌ కోల్‌లోని శిబిరం వద్దకు తీసుకొచ్చాం. బుధవారం రాత్రి ఆయన చనిపోయారు" అని వివరించారు.

ఇదీ చూడండి: కరోనా టీకా వేయించుకుంటే లాటరీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.