భారత్‌తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పిలుపునిచ్చింది నేపాల్. పొరుగుదేశంతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఛైర్మన్, మాజీ ప్రధాని పుష్ప కమల్ దాహాల్ వ్యాఖ్యానించారు.
"సరిహద్దు వివాదాన్ని చర్చలు, దౌత్యపరమైన విధానాలతో పరిష్కరించుకోవాలని తీర్మానించాం. భారత్‌తో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అన్ని పార్టీలు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాయి."
-- పుష్ప కమల్ దాహాల్, నేపాల్ మాజీ ప్రధాని.
భారత్ భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపిన అనంతరం దాహాల్.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.