ETV Bharat / international

త్రిపుర సీఎం వ్యాఖ్యలపై నేపాల్ అభ్యంతరం - బిప్లవ్​ కుమార్​ దేవ్​ వ్యాఖ్యలను తప్పుబట్టిన నేపాల్​

భాజపా నేత, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్​ కుమార్​ దేవ్ ఇటీవల​ చేసిన వ్యాఖ్యలను నేపాల్​ తప్పుబట్టింది. భాజపాను నేపాల్​లో విస్తరించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Nepal objects to BJP's expansion in their country
బిప్లవ్‌ కుమార్ దేవ్‌ వ్యాఖ్యలపై నేపాల్ అభ్యంతరం
author img

By

Published : Feb 17, 2021, 5:44 AM IST

నేపాల్​లో పార్టీని విస్తరించే యోచనలో అధిష్ఠానం ఉందని భాజపా నేత, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్​ కుమార్​ దేవ్​ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా అభ్యంతరం తెలిపినట్లు.. ఓ నేపాలీ ట్విట్టర్​ యూజర్​కు సమాధానమిచ్చారు నేపాల్​​ విదేశాంగ మంత్రి ప్రదీప్​ కుమార్ గైవాలీ.

ఈ మేరకు విదేశాంగ శాఖలో నేపాల్​, భూటాన్​ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి అరిందం బాగ్చీకి.. భారత్​లో నేపాల్​ రాయబారి నీలంబర్​ ఆచార్య తమ దేశం తరఫున అభ్యంతరాన్ని తెలిపినట్లు ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.

భాజపాను త్వరలో నేపాల్‌, శ్రీలంకలో విస్తరింపజేయాలని అధిష్ఠానం యోచిస్తోందని అగర్తలాలో ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో.. బిప్లవ్​ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బిప్లవ్​ కుమార్​ వ్యాఖ్యలపై పూర్తి సమాచారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.