ETV Bharat / international

ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన విపక్ష కూటమి - నేపాల్​ రాజకీయ సంక్షోభం

నేపాల్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బలనిరూపణకు ప్రధాని కేపీ శర్మ ఓలీ విముఖతతో.. విపక్షాల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. షేర్​ బహదూర్​ దేవ్​బాను ప్రధానిగా ప్రకటించాలని రాష్ట్రపతి విద్యా దేవీ భండారీని కోరాయి కూటమి పార్టీలు.

Nepal's Opposition alliance to stake claim to form govt
ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన విపక్ష కూటమి
author img

By

Published : May 21, 2021, 5:36 PM IST

నేపాల్ కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్​ నేత షేర్​ బహదూర్​ దేవ్​బా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను ప్రధానిగా ప్రకటించాలని రాష్ట్రపతి విద్యా దేవీ భండారీని కోరింది విపక్షాల కూటమి. తమకు 149 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరాయి కూటమిలోని పార్టీలు.

నేపాలీ కాంగ్రెస్​(61), మావోయిస్ట్​ సెంటర్​(48), జేఎస్​పీ(13), యూఎంఎల్​(27) పార్టీలు తమ ఎంపీల సంతకాలతో కూడిన పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించినట్లు స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

దేవ్​బా గతంలో వేర్వేరు సందర్భాల్లో.. నాలుగు సార్లు నేపాల్​ ప్రధానిగా పనిచేశారు.

271 స్థానాలున్న ప్రతినిధుల సభలో మేజిక్​ ఫిగర్​ 136.

ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ బలనిరూపణకు వెనక్కి తగ్గగా, రాష్ట్రపతి విద్యా దేవీ భండారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర రాజకీయ పార్టీలను కోరారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు.

ఇదీ చూడండి: ఓలీ విముఖత- మళ్లీ మొదటికి నేపాల్ సంక్షోభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.