ETV Bharat / international

వివాదాస్పద మ్యాపుపై నేపాల్ పార్లమెంటులో చర్చ - భారత్ నేపాల్ వివాదం

నేపాల్​ రూపొందించిన వివాదాస్పద జాతీయ పటాన్ని ఆమోదించుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ వైపు భారత్​తో చర్చలను కోరుకుంటున్నామని చెబుతూనే రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది.

NEPAL-PARLIAMENT-MAP
వివాదాస్పద మ్యాపుపై నేపాల్ పార్లమెంటులో చర్చ
author img

By

Published : Jun 9, 2020, 9:57 PM IST

సరిహద్దు వివాదంలో భారత్​తో నేపాల్​ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోంది. భారత్​తో చర్చలకోసం ఎదురుచూస్తున్నామని చెబుతోన్న నేపాల్​.. మరోవైపు కొత్తగా రూపొందించిన వివాదాస్పద జాతీయ పటాన్ని ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

మూడు దేశాల సరిహద్దులు కలిసే లిపులేఖ్​లో​ భారత్​ రహదారి ప్రారంభించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో లిపులేఖ్​తోపాటు కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపిస్తూ రూపొందించిన జాతీయ పటానికి నేపాల్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

అఖిల పక్ష భేటీతో..

ఈ పటాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు ఈ రోజు నేపాల్​ పార్లమెంటులో చర్చ కోసం బిల్లును ప్రవేశపెట్టారు నేపాల్ న్యాయశాఖ మంత్రి శివమయ్య. గత నెలలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అఖిల పక్షంతో చర్చించిన తర్వాత దీనిపై ముందుకెళ్లాలని ప్రధాని కేపీ శర్మ ఓలీ బిల్లును ఉపసంహరించుకున్నారు.

రాజ్యాంగంలోని షెడ్యూల్ 3 సవరణ ద్వారా ఈ మ్యాప్ అమల్లోకి వస్తుంది. ఇందుకు పార్లమెంటులో రెండొంతుల మెజారిటీ అవసరం. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి జాతీయ అసెంబ్లీలో తగిన ఆధిక్యం ఉన్నా.. దిగువ సభలో 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిల పక్ష భేటీకి ఓలీ సిద్ధపడ్డారు.

ప్రతిపక్ష పార్టీ మద్దతుతో..

ఇటీవల జరిగిన భేటీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్ బిల్లుకు మద్దతు ఇస్తామని తెలిపింది. ఫలితంగా మళ్లీ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు.

నేపాల్​ రూపొందించిన మ్యాపుపై భారత్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సార్వభౌమ అధికారం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: భారత్​తో చర్చలనే కోరుకుంటున్నాం: నేపాల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.