భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సంబంధం ఉన్న 22 సరిహద్దు మార్గాలను మూసేయాలని నిర్ణయించింది.
నేపాల్-భారత్ మధ్య మొత్తం 35 సరిహద్దు పాయింట్లు ఉండగా అందులో 22 పాయింట్లను మూసేయాలని.. నేపాల్ కొవిడ్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కో ఆర్డినేషన్ కమిటీ మంత్రి మండలికి సిఫారసు చేసింది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్ వెల్లడించింది.
ఐర్లాండ్లో క్వారంటైన్
భారత్‌లో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఐర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా హోటళ్లలో క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. భారత్‌తో పాటు జార్జియా, ఇరాన్, మంగోలియా, కోస్టారికా దేశాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
క్వారంటైన్ కోసం ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి : కరోనాపై గెలిచిన శతాధిక వృద్ధురాలు