నేపాల్‌లో వరదలు మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. 25 మంది తీవ్రంగా గాయపడగా, మరో 33 మంది ఆచూకీ గల్లంతైంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లపై వరదనీరు నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది.
లలిత్‌పుర్, కావ్రే, కొటంగ్, భోజ్‌పుర్, మకన్పుర్ జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువ ఉంది. ఆ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: కారు వదిలి నాటు పడవలో కొత్త జంట ప్రయాణం