ETV Bharat / international

'నావల్నీ ఏ క్షణంలోనైనా మరణించవచ్చు' - జైళ్లోనే నవాల్నీ దీక్ష

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ.. ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. మరణం అంచుల్లో ఉన్న నావల్నీ ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని చెప్పారు.

Navalny
నవాల్నీ
author img

By

Published : Apr 18, 2021, 8:07 AM IST

జైళ్లోనే మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ.. ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. మరణం అంచుల్లో ఉన్న నవాల్నీ ఏ క్షణంలోనైనా ప్రాణాలు విడవచ్చని చెప్పారు. శరీరంలో పొటాషియం స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పడిపోయాయని వెల్లడించారు. మూత్రపిండాల బలహీనతను సూచించే క్రియేటినిన్​ స్థాయిలు వైద్య పరీక్షల్లో వెల్లడయ్యాయని చెప్పారు. ఈ విషయాన్ని ఫేస్​బుక్​ పేజీ ద్వారా పంచుకున్నారు.

అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు వైద్యం అందించడానికి, వ్యక్తిగత వైద్యులకు జైళ్లోకి అనుమతి ఇవ్వకపోవడంపై నావల్నీ జైళ్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను నావల్నీ ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఈ ఏడాది జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించారు.

ఇదీ చదవండి: గూఢచర్యం కేసులో ఒకరు అరెస్ట్​

ఇదీ చదవండి: కమలా హారిస్​ను చంపేస్తానంటూ బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.