ETV Bharat / international

బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా!

ఉత్తర కొరియా శనివారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జపాన్​ సముద్రం (తూర్పు సముద్రం) వైపు ప్రయోగించింది. ఉత్తర ప్యోంగన్ రాష్ట్రం నుంచి ఈ ప్రయోగం జరిగిందని యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది.

N Korea fires two short-range ballistic missiles
బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా!
author img

By

Published : Mar 21, 2020, 8:48 AM IST

అగ్రరాజ్యం అమెరికా మాటలను ఉత్తర కొరియా లెక్కచేయడం లేదు. నిరాయుధీకరణ చర్చల్లో సుదీర్ఘ విరామం వచ్చిన నేపథ్యంలో మరోసారి క్షిపణి ప్రయోగానికి తెరతీసింది.

శనివారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జపాన్​ సముద్రం (తూర్పు సముద్రం) వైపు ఉత్తర కొరియా ప్రయోగించింది. ఉత్తర ప్యోంగన్ రాష్ట్రం నుంచి ఈ ప్రయోగం జరిగిందని 'సౌత్ జాయింట్ చీఫ్స్​ ఆఫ్ స్టాఫ్'​ను ఉటంకిస్తూ యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో కూడా ఉత్తర కొరియా రెండు సార్లు 'దీర్ఘ శ్రేణి క్షిపణు'లను పరీక్షించింది. అయితే ఇవి బాలిస్టిక్ క్షిపణులు అయ్యుండవచ్చని జపాన్ భావిస్తోంది.

చర్చలు విఫలమయ్యాయా?

ఉత్తర కొరియా ఆయుధీకరణ కార్యక్రమంపై ఐక్యరాజ్యసమితి, యూఎస్ అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ ఆ దేశం తన ఆయుధ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఈ పరిణామాల్ని పరిశీలిస్తే.. హనోయిలో ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన నిరాయుధీకరణ చర్చలు విఫలమయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెనక్కి తగ్గడం లేదు..

ఉత్తర కొరియా గతేడాది అనేక క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. వాటిలో చివరిగా.. నవంబర్​లో బహుళ రాకెట్ లాంఛింగ్ సిస్టమ్​లను పరీక్షించింది. అయితే శత్రుదేశాలు వాటిని బాలిస్టిక్ క్షిపణులుగా భావిస్తున్నాయి. అలాగే డిసెంబర్​లో స్టాటిక్ ఇంజిన్ పరీక్షలను కూడా ఉత్తర కొరియా నిర్వహించింది.

కట్లు తెంచుకుని...

2019 డిసెంబర్​లో కిమ్​ జోంగ్ ఉన్, ట్రంప్ మధ్య నిరాయుధీకరణ చర్చలు జరిగాయి. ఫలితంగా ఉత్తర కొరియా అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తుందని కిమ్ ప్రకటించారు. అయితే తాజా చర్యలు ఆ ఒప్పందాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయి.

ఇదీ చూడండి: అమెరికా అమ్ములపొదిలో అత్యంత వేగవంతమైన క్షిపణి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.