అమెరికా హెచ్చరికలను తోసిపుచ్చుతూ.. మరోసారి క్షిపణి పరీక్షలు చేపట్టింది ఉత్తర కొరియా. రెండు కొత్తతరం గైడెడ్ మిసైల్స్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కొరియా ద్వీపకల్పంలో సైనిక బెదిరింపులను ఎదుర్కొనేలా ఆయుధ సంపత్తిని పెంచుకొనేందుకు ప్రయోగం చేపట్టినట్లు ఆ దేశం ప్రకటించింది.
అమెరికా-ఉత్తరకొరియా మధ్య అణు చర్చలు నిలిచిపోయిన దృష్ట్యా ఉద్రిక్తతలు పెంచే చర్యలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇటీవలే అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. మరోవైపు.. ఐరాస భద్రతా మండలి తీర్మానాల్లో నిషేధించిన ఖండాంతర క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిందని జపాన్ ఆరోపించింది.
బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తర కొరియా చేపట్టిన మొదటి రెచ్చగొట్టే చర్య ఇదేనని నిపుణులు అంటున్నారు. భవిష్యత్‌లో జరపబోయే చర్చల్లో.. తన పరపతిని పెంచుకునే విధంగా బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తర కొరియా ఈ చర్యలు చేపడుతోందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'వాణిజ్య సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం'