ETV Bharat / international

మయన్మార్​ ఎన్నికల్లో 'అక్రమాల'పై సైన్యం దర్యాప్తు

మయన్మార్​లో తిరుగుబాటు చేసిన సైన్యం.. 11 మంది సభ్యులతో పాలనా మండలిని ఏర్పాటు చేసింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు సైన్యాధ్యక్షుడు మిన్ ఆంగ్ లయాంగ్ పేర్కొన్నారు. మరోవైపు, మయన్మార్​లో జరిగింది సైనిక చర్యేనని నిర్ధరించుకున్న అమెరికా... భారత్ సహా పలు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు ప్రారంభించారు.

Myanmar military forms state administration council
మయన్మార్​లో సైనిక 'పాలన'- ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు
author img

By

Published : Feb 3, 2021, 2:46 PM IST

మయన్మార్​లో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం.. పాలనాపరమైన కార్యకలాపాలను చేపడుతోంది. రాజ్యాంగంలోని 419 సెక్షన్ ప్రకారం 11 మంది సభ్యులతో పరిపాలన మండలిని ఏర్పాటు చేసినట్లు భద్రతా దళాల కమాండర్ ఇన్​ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. అటార్నీ జనరల్, కేంద్ర ఆడిటర్ జనరల్, మయన్మార్ కేంద్ర బ్యాంకు గవర్నర్ పదవులకు సభ్యులను నియమించింది. పలు మంత్రిత్వ శాఖలను సైతం కేటాయించింది.

సోమవారం తిరుగుబాటు తర్వాత దేశంలో సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పినట్లు కమాండర్ ఇన్ చీఫ్, మయన్మార్ ప్రస్తుత అధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్ పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అవకతవకలపై సూకీ ప్రభుత్వం విచారణ చేయకపోవడం కూడా తిరుగుబాటుకు ఓ కారణమని తెలిపారు. నూతనంగా ఏర్పాటయ్యే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.. ఓటింగ్ గణాంకాలను పరిశీలించి, సరైన ఫలితాలను గుర్తిస్తారని తెలిపారు. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సూకీ ప్రభుత్వం తీసుకున్న కరోనా నివారణ చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అవును.. సైనిక చర్యే

మయన్మార్​పై ఆంక్షలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మయన్మార్​లో సైనిక చర్య ద్వారానే ప్రభుత్వాన్ని పడగొట్టారని నిర్ధరించుకున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్.. ప్రభుత్వాధినేత ఆంగ్ సన్ సూకీ సహా ఇతర నేతలను సైన్యం నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మయన్మార్​లో అధికార బదలాయింపునకు కారణమైనవారిని బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

అంతకుముందు మాట్లాడిన రక్షణ శాఖ సీనియర్ అధికారులు.. భారత్, జపాన్ వంటి దేశాలతో ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మయన్మార్ సైన్యంతో మెరుగైన సంబంధాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆయా దేశాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

రోహింగ్యాల పరిస్థితి?

స్వదేశంలో సైనికపాలన విధించడంపై బంగ్లాదేశ్​లోని రోహింగ్యాలు తీవ్రంగా స్పందించారు. సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడాన్ని ఖండించారు. సొంతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్లడం మరింత భయంకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. 2017లో సైన్యం చేసిన అరాచకాలను ప్రస్తావిస్తూ ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిస్థితుల్లో సైన్యం తమను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేసినా.. వెళ్లబోయేది లేదని తేల్చిచెప్పారు. మళ్లీ తమను హింసిస్తారని చెబుతున్నారు.

నిరసనలు

కాగా, సైనిక తిరుగుబాటుపై మయన్మార్​లో నిరసనజ్వాలలు ఎగసిపడ్డాయి. దేశంలో అతిపెద్ద నగరమైన యంగోన్​లో భారీగా ప్రజలు కార్లలో చేరుకొని హారన్లు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తొలుత స్వల్ప సమయం పాటు ఈ నిరసన చేయాలని అనుకున్నప్పటికీ.. సైరన్ల మోత పావుగంట వరకు సాగింది. ఆంగ్ సన్ సూకీ ఆరోగ్యం క్షేమంగా ఉండాలంటూ నినాదాలు చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన చేపట్టాలని.. సూకీ సన్నిహితుడిగా పేరుగాంచిన సీనియర్ రాజకీయ నేత విన్ టెయిన్ పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.