ETV Bharat / international

మయన్మార్​లో 'కర్ఫ్యూ'- కఠిన ఆంక్షలు - మయన్మార్​లో సైనిక తిరుగుబాటు

మయన్మార్​లో చెలరేగిన ఆందోళనలను కట్టడి చేసేందుకు సైనిక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ప్రజలు బహిరంగంగా గుమిగూడటాన్ని నిషేధించింది.

Myanmar military coup: Curfew imposed in 7 townships of Mandalay
మయన్మార్​లో కర్ఫ్యూ : మిలిటరీ ప్రభుత్వం కీలక నిర్ణయం
author img

By

Published : Feb 9, 2021, 5:18 AM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు రాత్రి కర్ఫ్యూ విధించింది అక్కడి మిలిటరీ ప్రభుత్వం. ఐదుగురు కంటే ఎక్కువమంది బహిరంగంగా గుమిగూడవద్దని మయన్మార్​లోని రెండు ప్రధాన నగరాలైన యాంగాన్, మాండలేలో కఠిన ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ రాత్రి 8 నుంచి ఉదయం 4 వరకు ఉంటుందని తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఆంక్షలు కొనసాగుతాయని సైనిక అధికారులు స్పష్టం చేశారు.

నిరసన సెగ..

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా.. నిర్బంధంలో ఉన్న ఆంగ్​ సాన్​ సూకీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ యాంగాన్​ నగరంలో సోమవారం పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు ప్రజలు. పోలీసులు ఆందోళనకారులపై జలఫిరంగులు ప్రయోగించారు.

గత శనివారం ఆందోళనలు మరింత ఉద్ధృతం కావడం వల్ల.. ఇంటర్నెట్‌ సేవలను పరిమితం చేసింది సైన్యం. అయితే.. ఆదివారం వీటిని పునరుద్ధరించినట్టు సమాచారం.

గతేడాది మయన్మార్​లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మిలిటరీ అధికారులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే మయన్మార్​ అధినేత్రి, నేషనల్​ లీగ్ ఫర్​​ డెమొక్రసీ నాయకురాలు ఆంగ్​ సాన్​ సూకీని సైన్యం గృహ నిర్బంధంలో ఉంచింది. సూకీతో పాటు అధికార నేషనల్ లీగ్ ఫర్​ డెమొక్రసీ(ఎన్​ఎల్​డీ) పార్టీ ఛైర్మన్​ను సైతం సైన్యం అదుపులోకి తీసుకుంది.

ఇదీ చదవండి : భారీ నిరసనలతో మయన్మార్​ ఉక్కిరిబిక్కిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.