మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. యాంగూన్‌లోని వీధుల్లోకి పెద్దఎత్తున వచ్చిన ప్రజలు.. సైనిక పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ రోడ్లపై ప్రదర్శన చేపట్టారు.
మరోవైపు ఆందోళనకారుల్ని సైన్యం చెదరగొట్టింది. ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకున్న నాటి నుంచి ఇప్పటివరకు 766 మంది నిరసనకారుల్ని సైన్యం చంపినట్లు స్థానిక సంస్థలు తెలిపాయి. అయితే సైన్యం చెబుతున్న లెక్కలు మాత్రం తక్కువగా ఉన్నాయి.
ఇదీ చూడండి: టీకాల విషయంలో భారత్‌పై కొరియా సెటైర్!