ETV Bharat / international

మరణశిక్ష తీర్పును సవాలు చేసిన ముషారఫ్​ - తాజా ముషారఫ్​ దేశ ద్రోహం వార్తలు

పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు  ముషారఫ్​ తనకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ లాహోర్​ హై కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసును హడావిడిగా, తొందరపాటులో ముగించారని పిటిషన్​లో పేర్కొన్నారు.

Musharraf challenges special court's verdict in high treason case: Pak media
మరణశిక్ష తీర్పును సవాలు చేసిన ముషారఫ్​
author img

By

Published : Dec 27, 2019, 9:25 PM IST

పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు పర్వేజ్​ ముషారఫ్​..తనకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ లాహోర్​ హై కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ముషారఫ్‌ తరపున ఆయన న్యాయవాది అజార్‌ సిద్దిక్‌ తమ 86 పేజీల పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వంతో సహా మరి కొంతమందిని నిందితులుగా పేర్కొన్నారు.

ఈ కేసు విచారణ త్వరితగతిన, హడావిడిగా ముగిసిందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో క్రమరహితమైన, పరస్పర విరుద్ధమైన అంశాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రత్యేక కోర్టు తీర్పును వెంటనే నిలిపేయాలని ముషారఫ్​ న్యాయస్థానాన్ని కోరారు.

తనకు వ్యతిరేకంగా ప్రత్యేక న్యాయస్థానం ముందు సమర్పించిన సాక్ష్యాల్లో రాజద్రోహానికి పాల్పడినట్లు లేదని ముషారఫ్​ పిటిషన్​లో పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలేవి తాను తీసుకోలేదని తెలిపారు. పిటిషన్​ విచారణను.. జస్టిస్​ మజాహిర్​ అలీ అక్బర్​ నఖ్వీ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 9న విచారణ చేపట్టనుంది.

అందుకే దేశ ద్రోహం కేసు నమోదు

2007లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్‌ పాకిస్థాన్‌లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో 2013 డిసెంబరులో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది.

కేసు విచారణ జరుగుతుండగానే 2016 మార్చిలో ముషారఫ్‌ పాక్‌ విడిచి వెళ్లిపోయారు. కోర్టుకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా న్యాయస్థానానికి రాలేదు. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్​ ప్రస్తుతం దుబాయ్​లో చికిత్స పొందుతున్నారు.

New Delhi, Dec 27 (ANI): People staged a protest in Jor Bagh on December 27, demanding release of Bhim Army chief Chandrashekhar Azad. Speaking on the law and order situation in area, Parvinder Singh, Additional DCP Delhi South said, "Situation is peaceful here (in Jor Bagh), there is gathering of 50-60 people only. They have been requested to disperse from here. So far, they are adhering to the instructions given." Meanwhile, police detained protesters from outside Uttar Pradesh Bhawan in national capital.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.