పాకిస్థాన్‌లో అత్యధిక జనాభా కలిగిన ముల్తాన్ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. వానల కారణంగా 24 మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
వీరిలో ఎక్కువ మంది ఇంటి పైకప్పు, గోడ కూలటం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వరదల కారణంగా లాహోర్లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.
ఇదీ చూడండి: ఆన్లైన్లోకి రాలేని 27శాతం మంది విద్యార్థులు