ETV Bharat / international

Modi Dubai Expo: ఎక్స్​పో కోసం త్వరలో దుబాయ్​కు మోదీ! - దుబాయ్ ఎక్స్​పో వార్తలు

Modi Dubai Expo: వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ దుబాయ్​ ఎక్స్​పోను సందర్శించనున్నట్లు సమాచారం. ఇజ్రాయిల్​, అమెరికా, యూఏఈలు భారత్​తో సంయుక్త భేటీ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Modi Dubai Expo
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Nov 30, 2021, 1:53 PM IST

Modi Dubai Expo: దుబాయ్​ ఎక్స్​పోలో ఏర్పాటు చేసిన భారత పెవిలియన్​ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ పర్యటన ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి స్పష్టత లేకపోయినా.. పర్యటనకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

దుబాయ్​ వేదికగా ఇప్పటికే భారత్​-యూఏఈలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఆర్థిక- మౌలిక వసతులకు సంబంధించి త్వరలో ఇజ్రాయిల్​, అమెరికా దేశాలు కూడా యూఏఈ, భారత్​లతో సంయుక్తంగా మరోసారి భేటీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

అక్టోబరు 1న దుబాయ్​ ఎక్స్​పో ప్రారంభమైంది. ఈ ఎక్స్​పోలో భారత్​ ఏర్పాటు చేసిన పెవిలియన్​ను ఇప్పటివరకు 4 లక్షల మంది సందర్శించారు. వచ్చే ఏడాది మార్చి వరకు దుబాయ్​ ఎక్స్​పో ఉంటుంది.

ఇదీ చూడండి : ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.