ETV Bharat / international

పాక్​లో మరో ఆలయంపై దాడి- భారత్ ఆగ్రహం - ఆలయంపై అల్లరి మూకల దాడి

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా పంజాబ్​ రాష్ట్రం రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని ఓ ఆలయంపై దాడి జరిగింది. అల్లరి మూకలు ఆలయంలోకి చొరబడి నిప్పు పెట్టి, విగ్రహాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రేంజర్స్​ని మోహరించినట్లు చెప్పారు.

Mob attacks temple in Pakistan
పాక్​లో మరో ఆలయంపై దాడి
author img

By

Published : Aug 5, 2021, 10:43 AM IST

Updated : Aug 5, 2021, 6:22 PM IST

పాకిస్థాన్​ పంజాబ్​ రాష్ట్రంలోని ఓ హిందూ ఆలయంపై అల్లరి మూక దాడి చేసింది. ఆలయానికి నిప్పు పెట్టి విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక పోలీసులతో పరిస్థితులు అదుపులోకి రాకపోవటం వల్ల పాకిస్థాన్​ రేంజర్స్​ను రంగంలోకి దింపారు అధికారులు.

రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని భోంగ్​ నగరంలో ఉన్న హిందూ ఆలయంపై బుధవారం దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తలెత్తిన వివాదం తీవ్రమై... ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

ఎంపీ ట్వీట్​..

అధికార పాకిస్థాన్​ తెహ్రీక్​ ఏ ఇన్​సాఫ్​ పార్టీ ఎంపీ డాక్టర్​ రమేశ్​ కుమార్​ వంక్వానీ.. ఆలయంపై దాడి వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. భద్రతా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆలయంపై దాడిని అడ్డుకోవాలని కోరారు. హిందూ ఆలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్లు రాసుకొచ్చారు.

హిందూ కుటుంబాలకు భద్రత..

అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు జిల్లా పోలీస్​ అధికారి రహీమ్​ యార్​ ఖాన్​ అసద్​ సర్ఫరాజ్​. రేంజర్స్​ను రప్పించి.. ఆలయం చూట్టూ మోహరించినట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 100 హిందూ కుటుంబాలకు సైతం భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్​ చేయలేదన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించటం, మైనారిటీలకు భద్రత కల్పించటమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

పాక్ రాయబారికి సమన్లు

మందిరం కూల్చివేతపై నిరసన వ్యక్తం చేస్తూ.. పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. పాక్​లోని మైనారిటీల మత స్వేచ్ఛపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళనకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. తాజా ఘటనను ఖండిస్తూ పాక్​కు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: పాక్​లో మరో పురాతన ఆలయంపై దాడి!

Last Updated : Aug 5, 2021, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.