ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై వరుస రాకెట్ దాడులు జరిగాయి. బాగ్దాద్‌లోని బలాద్ వైమానిక స్థావరంపై బుధవారం మూడు రాకెట్లతో దాడి జరగగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. ఈ స్థావరంలో విదేశీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్లు చెప్పింది.
మరికొన్ని గంటల తర్వాత.. బాగ్దాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరంపై మరో రాకెట్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. అయితే.. ఇది రాకెట్ దాడా? లేదా డ్రోన్ దాడా? అన్నది వారు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఈ ఘటనా సమయంలో తాము రెండు రాకెట్ శబ్దాలను విన్నామని ఓ భద్రతాధికారి తెలిపారు. కానీ, ప్రాథమిక దర్యాప్తులో ఇది డ్రోన్ దాడిలానే కనిపిస్తోందని చెప్పారు.
ఇప్పటివరకు ఈ రాకెట్ దాడులకు బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ అమెరికా అధికారులు మాత్రం ఇది ఇరాన్ పనేనని అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: మందుపాతర పేలి ముగ్గురు మృతి
ఇదీ చూడండి: స్లిమ్‌గా మారిన కిమ్- ఆరోగ్యంపై మరోసారి చర్చ!