ETV Bharat / international

'పబ్​జీ'కి బానిసై తల్లి సహా కుటుంబాన్ని కాల్చి చంపిన మైనర్ - కుటుంబాన్ని కాల్చిచంపిన మైనర్

Minor Shot Family: పబ్​జీ గేమ్​కు బానిసైన ఓ బాలుడు తన కుటుంబాన్ని హతమార్చాడు. తల్లి, తోబుట్టువులు నిద్రిస్తున్న సమయంలో వారిని కాల్చిచంపాడు. శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.

Minor Shot Family
కుటుంబాన్ని కాల్చి చంపిన మైనర్
author img

By

Published : Jan 28, 2022, 8:07 PM IST

Minor Shot Family: పబ్​జీ వీడియో గేమ్​కు బైనిసైన ఓ మైనర్​ తన తల్లి సహా ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. పాకిస్థాన్​లోని పంజాబ్​ ప్రావిన్స్​లో గత వారం జరిగిన ఈ దుర్ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్​ను అదుపులోకి తీసుకున్నారు.

రక్షణ కోసం తీసుకున్న పిస్టోల్​తో..

లాహోర్​లోని కహ్నా ప్రాంతానికి చెందిన నిందితుడు పబ్​జీ ఆటకు బానిసయ్యాడు. దీంతో అతనికి మానసిక సమస్యలు కూడా వచ్చాయి. ఆ వీడియో గేమ్​ను విపరీతంగా ఆడుతూ చదువుపై శ్రద్ధ చూపట్లేదని అతని తల్లి నహీద్​ ముబారక్​ (45) మందలించింది. దీంతో నిందితుడు అదే రోజు రాత్రి కప్​బోర్డులో ఉన్న పిస్టోల్​ తీసుకుని తల్లి, సోదరుడు తైముర్ (22) సహా మరో ఇద్దరు తోబుట్టువులను కాల్చిచంపాడు. మరుసటి రోజు ఉదయం ఈ ఘటనపై నిందితుడు పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటన జరిగిన సమయంలో తాను మేడ మీద ఉన్నానని తనకు ఏమీ తెలియదంటూ నిందితుడు నాటకం ఆడాడు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. బాలుడు ఉపయోగించిన తుపాకీ.. అతని తల్లి కుటుంబ రక్షణ కోసం కొంతకాలం క్రితం తీసుకుందని పోలీసులు వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ జరిగింది : కొత్త వైరస్​పై వుహాన్​ సైంటిస్టుల వార్నింగ్- ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.