ETV Bharat / international

మయన్మార్​: ప్రవాస భారతీయులకు కేంద్రం సూచనలు - సైనిక పాలనలో మయన్మార్

మయన్మార్​లో సైనిక పాలన నడుస్తుండటం వల్ల ప్రవాస భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత్​ కోరింది. ఎలాంటి సహాయానికైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రందించాలని సుచించింది.

Myanmar
మయన్మార్
author img

By

Published : Feb 2, 2021, 9:10 PM IST

Updated : Feb 2, 2021, 9:55 PM IST

మయన్మార్​లో ఉన్న భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రవాస భారతీయులకు కీలక సూచనలు చేసింది. మయన్మార్​లో సైనిక పాలన దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని పేర్కొంది. ఈ మేరకు పలు సూచనలతో ప్రకటన విడుదల చేసింది.

"మయన్మార్​లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రవాస భారతీయులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి సహాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి."

- మయన్మార్​లో భారత రాయబార కార్యాలయం

భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం మయన్మార్​లో 7 వేల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 15 లక్షల నుంచి 25 లక్షల వరకు భారతీయ మూలాలున్న వారు నివసిస్తున్నారు.

భారత్​ ఆందోళన..

మయన్మార్‌లో ప్రజాస్వామ్యం అన్నది మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. ఆ దేశ సైన్యం చేసిన కుట్రను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుపడుతోంది. మయన్మార్‌లో భారీమెజారిటీతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తొలిసారి పార్లమెంటు సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవడానికి కొద్ది గంటల ముందు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ప్రజాప్రభుత్వం కుప్పకూలింది. అధికార పార్టీ ఎన్​ఎల్​డీ అధ్యక్షురాలు ఆంగ్‌సాన్‌సూకితో పాటు.... ఆ దేశాధ్యక్షుడు విన్ మియింట్‌ సైనిక నిర్బంధంలో ఉన్నారు.

అంతర్జాలం సహా టీవీ సిగ్నల్స్‌ను సైన్యం నిలుపుదల చేయడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఈ పరిణాలపై స్పందించిన భారత్​.. ప్రజాస్వామ్యం కంటే అత్యున్నతమైనది లేదని.. ప్రజాప్రభుత్వాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని పేర్కొంది.

Last Updated : Feb 2, 2021, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.