సెంట్రల్ సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రయాణించే బస్సును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలికతో సహా 9 మంది చనిపోయారని అక్కడి రాష్ట్ర మీడియా తెలిపింది. ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో దాడులకు తెగబడడం ఈ వారంలో ఇది రెండో సారి.
గత బుధవారం ఇళ్లకు వెళ్తున్న సైనికుల బస్సుపై కాల్పులకు ఒడిగట్టిన మిలిటెంట్లు.. 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఏడాది కాలంగా సిరియాపై ప్రాదేశిక నియంత్రణ కోల్పోయిన ఐఎస్ ఉగ్రవాదులకు.. దేశంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో మాత్రం పట్టుంది.
ఈ దాడులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బస్సుతో పాటు చమురు ట్రక్కుపైనా దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: 'న్యాయాధికారి కావాలంటే న్యాయవాదిగా అనుభవం ఉండాల్సిందే'