ETV Bharat / international

'మాయా బీచ్​' చూడాలంటే 2021 వరకు ఆగాల్సిందే! - Thailand

ప్రముఖ హాలీవుడ్​ చిత్రం 'ద బీచ్​'లో మెరిసిన థాయ్​లాండ్​ 'మాయా బీచ్'​ చూడాలంటే పర్యటకులు 2021 వరకు ఆగాల్సిందే. ఏళ్లతరబడి అధిక సంఖ్యలో వచ్చే యాత్రికుల కారణంగా ఈ తీరం​ కాలుష్యం బారిన పడింది. ఇక్కడి వనరులు, సముద్ర జీవులు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

'మాయా బీచ్​' చూడాలంటే 2021 వరకు ఆగాల్సిందే!
author img

By

Published : May 17, 2019, 7:33 AM IST

థాయ్​లాండ్​ మాయా బీచ్​

థాయ్​లాండ్​లోని 'ఫిఫిలే' ద్వీపంలో ఉన్న 'మాయా' బీచ్​ను సందర్శించాలనుకుంటున్న వారికి చేదు వార్త చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడున్న పర్యటక నిషేధ గడువున మరింత కాలం పొడిగించింది. 2021 వరకు బీచ్​లోకి పర్యటకులకు అనుమతి లేదని ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా ఈ సుందరమైన సముద్ర తీరాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. ఫలితంగా ఇక్కడి తీరప్రాంత పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు మరింత సమయం పడతుందనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

చూపరులను కట్టిపడేసే సహజసిద్ధ వనరులు, చక్కటి తీరప్రాంతం​, సూది వేసినా కనిపించేంత స్పష్టంగా ఉండే సముద్ర జలంతో కూడిన మాయాబీచ్... థాయ్​లాండ్​లోని పర్యటక ప్రాంతాల వరుసలో ముందు ఉంటుంది. అందుకే ఈ చూడచక్కని సముద్ర తీరాన్ని సందర్శించేందుకు ప్రతిరోజు సరాసరి 4 వేల మందికి పైగా పర్యటకులు వస్తుంటారు. కేవలం 2018లోనే 25 లక్షల మంది ప్రజలు ఈ తీరప్రాంతాన్ని సందర్శించారని థాయ్​లాండ్​ అధికారులు తెలిపారు. బీచ్ సందర్శన​ పునఃప్రారంభమయ్యాక కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రోజుకు 2 వేల మంది పర్యటకులను మాత్రమే అనుమతించాలని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది.

గతేడాదే పర్యటకులకు నో ఎంట్రీ

బీచ్​లో పర్యావరణం దెబ్బతిన్న కారణంగా పర్యటకులను అనుమతించకూడదని గతేడాది జూన్​లో నిర్ణయం తీసుకున్నారు అధికారులు. తాత్కాలికంగా 4 నెలల పాటు మూసివేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అయితే తీరంలోని వనరులు పూర్తిగా మామూలుస్థితికి రావడానికి మరింత సమయం అవసరమని నిపుణులు సూచించారు. ఫలితంగా మరోసారి బీచ్​ సందర్శనకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.

'ద బీచ్'​తో ప్రసిద్ధి

టైటానిక్​ కథానాయకుడు, ఆస్కార్​ గ్రహీత లియోనార్డో డికాప్రియో నటించిన 'ద బీచ్'​ చిత్రాన్ని 1999లో ఈ సముద్రంలోనే​ చిత్రీకరించారు. ఫలితంగా మాయాబీచ్​ ప్రపంచ దేశాల ప్రజలకు మరింత చేరువైంది.

ఇదీ చూడండి : వాళ్లొస్తున్నారని 'రెడ్​ లైట్​ ఏరియా' బంద్

Gurugram (Haryana), May 16 (ANI): Haryana Police on Thursday arrested two men for allegedly threatening a toll attendant by brandishing a fake gun and driving off without paying. The incident took place at Kherki Daula toll plaza at around 9:30 pm on Wednesday. The CCTV footage shows a man getting out of white car at the plaza and pulling out a gun. A case was registered under relevant sections. Further investigation is underway.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.