ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గిప్స్‌ల్యాండ్ ఇప్పుడు భారీ సాలెగూళ్లకు నెలవుగా మారింది. ఇటీవలే ఈ ప్రదేశంలోకి వరదలు వచ్చాయి. వరదలు తగ్గిన తర్వాత సాలీళ్లు గూళ్లు తయారు చేస్తున్నాయి. ఒక ప్రదేశంలో ఈ సాలెగూడు రోడ్డుపక్కన దాదాపు కిలోమీటరు పొడవు ఉంది. చూడటానికి ఈ దృశ్యాలు చెట్లపై దుప్పటి పరిచినట్లు కనిపిస్తున్నాయి. వీటిని నిపుణులు పరిశీలించారు. సాలీళ్లు మనుగడ కోసం అనుసరించే 'బలూనింగ్' అనే విధానమని చెప్పారు. ఈ పురుగుల నోటి నుంచి వచ్చే సిల్క్ వంటి ద్రవాన్ని దూరంగా విసరి వీటిని అల్లుతాయని పేర్కొన్నారు. ఇక్కడ కొన్ని లక్షల సంఖ్యలో సాలీళ్లు ఒక్కసారిగా ఈ ప్రక్రియ చేపట్టాయని విక్టోరియాలోని పురుగుల మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ కెన్ వాకర్ తెలిపారు. ''నేలపై ఉండే ప్రత్యేకమైన సాలీళ్లు వీటిని నిర్మించాయి. వేగంగా భూమిపై నుంచి అవి మొక్కలపైకి చేరుకోవడానికి వీటిని నిర్మించాయి. వరద నీరు వచ్చిన సమయంలో సిల్క్ వంటి పదార్థాన్ని మొక్కలపైకి విసిరి అవి వేగంగా భూమిపై నుంచి తప్పించుకొంటాయి'' అని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా చిత్తడి భూములు ఉన్న సేల్, లాంగ్‌ఫోర్డ్ మధ్య ఇవి ఏర్పడ్డాయని తెలిపారు.
-
#WATCH | Massive spider web blankets Australia’s bushland after heavy rains in the region. Visuals from Gippsland, Victoria.
— ANI (@ANI) June 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) pic.twitter.com/3jGwARkHHk
">#WATCH | Massive spider web blankets Australia’s bushland after heavy rains in the region. Visuals from Gippsland, Victoria.
— ANI (@ANI) June 17, 2021
(Source: Reuters) pic.twitter.com/3jGwARkHHk#WATCH | Massive spider web blankets Australia’s bushland after heavy rains in the region. Visuals from Gippsland, Victoria.
— ANI (@ANI) June 17, 2021
(Source: Reuters) pic.twitter.com/3jGwARkHHk
వాగ్రాంట్ హంటర్ జాతి సాలీళ్లు ఇలా చేస్తాయి. ఒక్కసారి ఇంత భారీ మొత్తంలో చేయడాన్ని గోసమీర్ ఎఫెక్ట్ అంటారు. ఈ పురుగులు భూమిపై జీవిస్తాయి. ఇవి వరదల సమయంలో ఒక్కసారి సిల్క్ వంటి పదార్థాన్ని మొక్కలపైకి విసిరితే మళ్లీ గూళ్లు కట్టుకోలేవు. ఇలా విసరడానికి వాటికి ఒక్కసారి మాత్రమే సాధ్యమవుతుందని వాకర్ వెల్లడించారు.
గతంలో కూడా ఇలాంటివి ఏర్పడ్డా.. ఈ స్థాయిలో మాత్రం లేవని తెలిపారు. ఈ భారీ సాలెగూడులు ఒక వారంలోపు తొలగిపోతాయని అంచనావేస్తున్నారు. గత వారం భారీ గాలులు, వర్షాలు విక్టోరియా రాష్ట్రాన్ని కుదిపేశాయి. మెరుపు వరదలు కూడా వచ్చాయి.
ఇదీ చూడండి: మానవ మనుగడకు పెనుముప్పుగా 'ఎడారీకరణ'