ETV Bharat / international

పేలిన గ్యాస్​ పైపు- 12 మంది మృతి

Many people trapped under debris in China
పేలిన గ్యాస్​ పైపు
author img

By

Published : Jun 13, 2021, 9:34 AM IST

Updated : Jun 13, 2021, 1:46 PM IST

09:27 June 13

పేలిన గ్యాస్​ పైపు- 12 మంది మృతి

చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్​ పైపు పేలిన ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 138మందికి తీవ్ర గాయాలయ్యాయి.  హుబే ప్రావిన్సులోని షియాన్​ నగరంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయని చెప్పారు.  

షియాన్ నగరంలోని యన్హు అనే మార్కెట్​లో ఈ గ్యాస్​పైపు పేలిందని హాంకాంగ్​కు చెందిన సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్​ అనే మీడియా కథనం వెలువరించింది. అంతకుముందు.. శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయారని షియాన్​ నగర మున్సిపల్​ అధికారులు తెలిపారు.  

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 150 మందిని రక్షించారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Jun 13, 2021, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.