తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తూర్పు తైవాన్‌లోని ఓ సొరంగంలో రైలు పట్టాలు తప్పి ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో 36 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పడం వల్ల లోపలికి చేరుకోవడం సహాయక బృందాలకు కష్టతరంగా మారింది. సొరంగంలో దాదాపు 70 మంది చిక్కుపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ రైలులో మొత్తం 350 మంది ఉన్నారు. 75 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
కొండ ప్రాంతంలోని మార్గం నుంచి ఓ కారు సొరంగ మార్గం దగ్గరున్న రైల్వే పట్టాలపై పడింది. దాంతో పట్టాలపై ఉన్న కారును రైలు ఢీ కొట్టి సొరంగంలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో రైలు సగ భాగం సొరంగంలోకెళ్లి ఆగిపోయింది. ఈ రైలు టైటంగ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: తూర్పు తైవాన్‌లో రైలు ప్రమాదం- 36మంది మృతి