ETV Bharat / international

మహిళ వేషంలో కరోనా రోగి ఫ్లైట్ జర్నీ​- చివర్లో దొరికిపోయాడిలా...

కరోనా సోకినప్పటికీ.. ఓ వ్యక్తి తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు విమాన ప్రయాణం చేశాడు. అందుకు తన వేషాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. కానీ, అధికారులు గమనించి అతణ్ని పట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

బురిడీ కొట్టిద్దామనుకున్నాడు.. కానీ, బుక్కయ్యాడు
author img

By

Published : Jul 22, 2021, 2:40 PM IST

అసలే కరోనా కాలం. విమాన ప్రయాణాలు చేయాలంటే.. ఎన్నో ఆంక్షలు. అయితే.. ఈ ఆంక్షల నుంచి తప్పించుకుని వేరే ప్రాంతానికి వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. అతి తెలివి ప్రదర్శించాడు.

అసలేం జరిగింది?

కరోనా సోకినప్పటికీ.. ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళ్లాలనుకున్నాడు. అందుకు తన భార్యలా వేషాన్ని మార్చుకున్నాడు. బురఖా వేసుకుని, భార్య గుర్తింపు కార్డును, ఆమెకు కరోనా ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేయించగా వచ్చిన నెగెటివ్​ రిపోర్టును పెట్టుకుని, జకార్తా నుంచి మలుకు దీవుల్లోని టెర్నేట్​కు విమాన ప్రయాణం చేశాడు. అయితే.. అతడు బాత్​రూంలో బట్టలు మార్చుకుని బయటకు వస్తుండగా అధికారులు పసిగట్టారు.

"తన భార్య పేరు మీద అతడు విమాన టికెట్​ కొనుక్కున్నాడు. ఆమె గుర్తింపు కార్డే తెచ్చుకున్నాడు. తన భార్య పేరు మీదనే పీసీఆర్​ పరీక్ష ఫలితం సహా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకున్నాడు. మిగతా అన్ని పత్రాలను తన భార్య పేరు మీదవే."

-ఆదిత్య లక్సిమాదా, టెర్నేట్​ పోలీస్​ అధికారి

అధికారులు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం అతడు క్వారంటైన్​లో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇండోనేసియాలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. కొత్తగా అక్కడ 33,372 మందికి పాజిటివ్​ సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 1,383 మంది మరణించారు.

ఇదీ చదవండి : 'డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనతో షాక్​ అయ్యాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.