ఓ మానసిక రోగి.. తన ఐదుగురు కుటుంబసభ్యుల్ని హత్యచేసిన ఘటన పాక్లో వెలుగుచూసింది. మతిస్థిమితం సరిగాలేని జిహాన్జెబ్ సుర్ఖేలీ.. తన కుటుంబ సభ్యుల్ని కాల్చిచంపాడు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతడు మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.
ఇదీ జరిగింది..
ఖైబర్ పంఖ్తువా రాష్ట్రంలోని బటాగ్రమ్ జిల్లాలో సుర్ఖేలీ కుటుంబం నివాసముంటోంది. కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన చిన్నపాటి వాగ్వివాదం కారణంగా ఆగ్రహానికి గురైన నిందితుడు.. తన ఇద్దరు భార్యలు, కూతురు, కుమారుడితో సహా కోడలిని హతమార్చాడు. అనంతరం వారిని ఇంట్లోనే పాతిపెట్టేందుకు యత్నించాడు. అతడిని అడ్డుకున్న స్థానికులను బెదిరించాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతణ్ని లొంగిపొమని ఆదేశించారు. కానీ వారిపైనా కాల్పులు జరిపాడు సుర్ఖేలీ. పోలీసులు కూడా ఎదురుదాడికి దిగడం వల్ల నిందితుడు మృతి చెందాడు.
ఇదీ చదవండి: సమోసా దౌత్యం: మోదీ కోసం వంట చేసిన ప్రధాని