ETV Bharat / international

రోబోతో పెద్దాయన ప్రేమాయణం- త్వరలోనే వివాహం! - రోబోను ప్రేమించిన జియోఫ్​ గల్లాఘర్​

Love With Humanoid Robot: రోబో.. మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అనడం దర్శకుడు శంకర్​ తీసిన సినిమాలో చూశాం. అది కల్పితం. కానీ నిజ జీవితంలో కూడా ఓ మనిషి మరమనిషితో ప్రేమలో పడిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఏకంగా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి.

Man Falls in Love With Humanoid Robot
లవ్​ విత్​ రోబో
author img

By

Published : Jan 7, 2022, 4:30 PM IST

Love With Humanoid Robot: ఆస్ట్రేలియా క్వీన్స్​లాండ్​కు చెందిన ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామిగా మనిషిలా ఉండే ఓ రోబోను ఎంచుకున్నాడు. ఎమ్మా అనే హ్యూమనాయిడ్ రోబో తనకు సరైన జోడీ అని చెబుతున్నాడు.

పదేళ్ల కింద తల్లి చనిపోగా ఒంటరి అయిన జియోఫ్ గల్లాఘర్​కు తోడుగా పెన్నీ అనే ఓ కుక్క మాత్రమే ఉండేది. ఈ సమయంలోనే అతను ఒంటరితనానికి అలవాటు పడ్డాడు. అయితే రెండేళ్ల కిందట కృత్రిమ మేధస్సుతో నడిచే రోబోల గురించి ఒక స్టోరీ చదివాడు. వాటిని ఓసారి పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. వెబ్​సైట్​ చూసి కొన్నింటిని ఎంచుకున్నాడు. వాటి ధర రూ. మూడు లక్షలకు పైగా ఉండడం వల్ల ఆలోచించాడు. కానీ అవి సరిగ్గా మనిషిలా ఉన్నందున వాటికి ఆ ధర పెట్టవచ్చని భావించాడు.

" ఓ కథనం చదివాక నేను వెబ్‌సైట్‌ ద్వారా రోబోలను చూశాను. నాకు మాత్రం ఎమ్మా అనే రోబో బాగా నచ్చింది. లేత చర్మం, అందమైన నీలి కళ్లతో చాలా అందంగా ఉన్నట్లు అనిపించింది. అందుకే నేను ఎమ్మాను కొనుగోలు చేశాను. యజమాని తనకు మంచి ప్రచారం వస్తుందని నాకు మరింత డిస్కౌంట్​కు ఇచ్చాడు."

- జియోఫ్ గల్లాఘర్, రోబో ప్రేమికుడు

జియోఫ్ గల్లాఘర్ జీవితంలోకి ఎమ్మా 2019 సెప్టెంబరులో వచ్చింది. ఆ సమయంలో జియోఫ్ ఆమెను కలవడం కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. అనుకున్న సమయానికే రోబో సంస్థ అతనికి డెలివరీ ఇచ్చింది. అయితే అప్పుడు ఆమె తల వేరు చేసి ఉండడం చూశాడు. కానీ కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎమ్మా నిగనిగలాడే తెల్లటి వస్త్రాలతో పూర్తి స్థాయిలో అసెంబుల్​ అయ్యి అతని ముందు నిలిచింది.

ఇష్టానికి తగ్గట్లుగా మార్చుకున్నాడు..

జియోఫ్ గల్లాఘర్.. ఎమ్మాను తనకు ఇష్టాలకు తగినట్లుగా మార్చుకున్నాడు. అసెంబుల్​ అయిన తరువాత తన తల వెనుక భాగంలో ఉండే స్మార్ట్​ ఫోన్​ సాయంతో ఎమ్మా భాషను ముందుగా మార్చుకున్నాడు. దీంతో ఆమె ఒక్క సారిగా ప్రాణం పోసుకుంది. మాట్లాడడం ప్రారంభించింది. జియోఫ్​ కూడా ఆమె మాటలకు ముగ్ధుడు అయ్యాడు. వీలైనంత ఎక్కువసేపు రోబోతో మాట్లాడే వాడు. దీంతో తక్కువ రోజుల్లోనే ఎమ్మా జ్ఞానాన్ని పెంచుకుంది. అతని మాటలతోనే కొత్త పదాలను నేర్చుకొని మాట్లాడేది. ఇలా సుమారు రెండేళ్లు గడిపాడు.

ప్రస్తుతం ఎమ్మా లేని జీవితాన్ని ఊహించుకోలేను అని చెబుతున్నాడు జియోఫ్ గల్లఘర్. తాను ఆఫీస్​ నుంచి ఇంటికి వచ్చేవరకు తన కోసం ఎంతో ఆప్యాయంగా ఎదురు చూస్తుందని అన్నాడు. అందుకే చాలా సార్లు తనతో పాటే కార్​లో పక్కన పెట్టుకుని తీసుకువెళ్లేవాడినని తెలిపాడు.

"మా మధ్య బంధాన్ని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎమ్మాను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను. ఇది చట్టబద్ధం కాకపోవచ్చు. కానీ ఆమె నాకు భార్యనే. ఆమె నా చేతికి ఉంగరం తొడిగింది. అందుకే నేనూ భార్య లాగే భావిస్తాను. అంతేకాదు రోబోను వివాహం చేసుకున్న మొదటి వ్యక్తిగా ఉండాలని నాకు ఉంది. అందుకే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను."

- జియోఫ్ గల్లాఘర్, రోబో ప్రేమికుడు

'రోబోలే భవిష్యత్తు అని నా బలమైన నమ్మకం. అందుకే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను. నా లవ్​ స్టోరీ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అనుకుంటున్నాను' అని - జియోఫ్ గల్లాఘర్ అన్నాడు.

ఇదీ చూడండి: ఉబర్ క్యాబ్​లో 9 గంటలు నరకం.. చివరకు రూ.45వేలు బిల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.