మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. సొరంగ మార్గంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. దీంతో 200 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పెట్రోనాస్ టవర్స్‌కు సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డట్లు, 160 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. రైళ్లలో సమాచార లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: చైనా- ఇరాన్ ఒప్పందం- భారత విధానాలకు ముప్పు!