జపాన్ టోక్యో నగరానికి ఆగ్నేయ దిశగా 600మైళ్ల దూరంలోని చిచిజీమా ద్వీపంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2గా తీవ్రత నమోదైంది. సుమారు 10కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.
భూకంప ప్రాంతంలో సునామీ ప్రమాద హెచ్చరికలు ఇంకా జారీచేయలేదు. 2011లో భూకంపం, సునామీ ధాటికి జపాన్లో దాదాపు 15వేల మంది మరణించారు.