ETV Bharat / international

Viral: విమానం నుంచి జారిపడిన అఫ్గాన్​ ప్రజలు

తాలిబన్ల ఆక్రమిత అఫ్గానిస్థాన్​లో ప్రజల భయాందోళనలకు అద్దం పట్టే దృశ్యాలు బయటకొచ్చాయి. తాలిబన్ల పాలనకు భయపడి పలువురు అఫ్గాన్ ప్రజలు విమాన రెక్కలపైనే ప్రయాణించారు. ఈ క్రమంలో గాలిలో ఉండగానే విమానంపై నుంచి కిందపడి కొందరు మరణించారు.

running flight
విమానం నుంచి కింద పడ్డ అఫ్గాన్ పౌరులు
author img

By

Published : Aug 16, 2021, 3:32 PM IST

Updated : Aug 16, 2021, 10:35 PM IST

తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్(Afghanistan conflict) నుంచి బయటపడేందుకు అక్కడి ప్రజలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. విమానాలు ఎక్కి వేలాది మంది దేశాన్ని విడిచివెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా రెక్కలతో పాటు విమాన పైభాగాన(Afghan plane) ఉంటూ ప్రయాణించారు.

విమానం నుంచి కింద పడుతున్న దృశ్యాలు

ఈ సమయంలోనే టేకాఫ్ అయిన సీ-130జే విమానం నుంచి పలువురు జారి కింద పడుతున్న(Afghanistanis falling off plane) దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. దాదాపు ముగ్గురు వ్యక్తులు విమానం నుంచి కిందపడి చనిపోయి ఉంటారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అఫ్గానిస్తాన్ ప్రజలు చేస్తున్న చర్యలు... ప్రస్తుతం కాబుల్‌లోని ప్రమాదకర పరిస్థితి(Kabul airport tragedy)కి అద్దం పడుతున్నాయి.

ఇదీ చదవండి: విమానం రెక్కలపైకి ఎక్కిన అఫ్గాన్​ ప్రజలు..!

మరోవైపు, కాబుల్ విమానాశ్రయం(Kabul airport)లోనూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాజధానిని తాలిబన్లు చుట్టుముట్టారన్న వార్త తెలియగానే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాలకు పరుగులు తీస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడం వల్ల చాలా మంది మొదట కాబుల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు ఎక్కువగా ఉండటం వల్ల ముష్కర మూకలను అడ్డుకొంటాయని ఆశించారు. కానీ ఊహించిన దానికన్నా వేగంగా తాలిబన్లు రాజధానిని(Taliban in kabul) చుట్టుముట్టడం వల్ల ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ఖాతా హ్యాక్​..

తమ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని దిల్లీలోని అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయం తెలిపింది. హ్యాక్​కు గురైన తర్వాత ఖాతా నుంచి అష్రఫ్ ఘనీ(Ashraf Ghani)కి వ్యతిరేకంగా పలు ట్వీట్లు వచ్చాయని వెల్లడించింది. ఈ విషయాన్ని అఫ్గాన్ రాయబార కార్యాలయ(Afghanistan embassy) ప్రెస్ సెక్రెటరీ అబ్దుల్​హక్ ఆజాద్.. తన వ్యక్తిగత ఖాతా నుంచి ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: అఫ్గాన్‌లో యుద్ధం ముగిసింది.. తాలిబన్ల ప్రకటన

Last Updated : Aug 16, 2021, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.