ETV Bharat / international

శ్రీలంకలో రాజకీయ దుమారం- కరుణ వ్యాఖ్యలపై దర్యాప్తు - శ్రీలంక ప్రభుత్వం

తాను ఒక్కడినే 2 వేలకుపైగా శ్రీలంక భద్రతా బలగాలను హత్య చేసినట్టు ఎల్​టీటీఈ మాజీ డిప్యూటీ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తునకు ఆదేశించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ మేరకు శ్రీలంక రక్షణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

Lankan govt orders police probe into ex-LTTE deputy leader's claim of killing 2,000 to 3,000 troops
ఎల్​టీటీఈ మాజీ డిప్యూటీ వ్యాఖ్యలపై శ్రీలంక దర్యాప్తు
author img

By

Published : Jun 22, 2020, 5:14 PM IST

తాను ఒక్కడినే 2000 మందికిపైగా భద్రతా సిబ్బందిని హత్య చేసినట్టు.. ఎల్​టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం) మాజీ డిప్యూటీ కరుణ అమ్మన్​ చేసిన వ్యాఖ్యలు శ్రీలంకలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరుణ అమ్మన్​ వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని శ్రీలంక ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

అమ్మన్​ వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని శ్రీలంక నేర దర్యాప్తు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు ఆ దేశ పోలీసుశాఖ సారథి చందన విక్రమరత్నె. ఈ విషయాన్ని శ్రీలంక రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల ర్యాలీలో...

శ్రీలంకలో ఆగస్టు 5న పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. గత వారం ఓ ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఎల్​టీటీఈ మాజీ డిప్యూటీ కరుణ అమ్మన్. ప్రభుత్వంపై ఎల్​టీటీఈ సాగించిన మూడు దశాబ్దాల పోరులో.. తాను ఒక్కడినే అనేకమంది భద్రతా సిబ్బందిని హతమార్చినట్టు వ్యాఖ్యానించారు అమ్మన్​. ఎలిఫాంట్​ పాస్​ వేదికగా ఓ రోజు తాను 2000-3000కుపైగా శ్రీలంక సిబ్బందిని చంపినట్టు వెల్లడించారు. ఇది దేశంలో కరోనా మరణాల కన్నా ఎక్కువని పేర్కొన్నారు.

శ్రీలంక తమిళుల స్వాతంత్ర్యం కోసం ఎల్​టీటీఈని 1976 సంవత్సరంలో పెద్దపులిగా పిలిచే వేలుపిళ్లై ప్రభాకరన్ స్థాపించారు. అందులో రెండో కీలక వ్యక్తి అమ్మన్​. 2004లో ఎల్​టీటీఈ నుంచి విడిపోయిన ఆయన.. సొంతంగా పార్టీని స్థాపించారు. అనంతరం 2009లో ప్రభుత్వం చేతిలో ఎల్​టీటీఈ ఓడిపోయింది.

ఆ తర్వాత.. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సతో చేతులు కలిపి 2010లో పార్లమెంట్​లో అడుగుపెట్టారు అమ్మన్​.

అప్పటి నుంచి రాజపక్స పార్టీ.. ఎస్​ఎల్​పీపీకి అమ్మన్​ సన్నిహితుడు. అయితే తాజాగా అమ్మన్​ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడం వల్ల.. మాజీ ఎల్​టీటీఈ డిప్యూటీతో తమకు సంబంధం లేదని ఎస్​ఎల్​పీపీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.