శ్రీలంకలో 8 వరుస పేలుళ్ల అనంతరం మరో బాంబు కలకలం రేపింది. ఆదివారం అర్థరాత్రి కొలంబో విమానాశ్రయం సమీపంలో పైపు బాంబును అధికారులు గుర్తించారు. వెంటనే నిర్వీర్యం చేశారు. ఆ బాంబు స్థానికంగా తయారు చేసిందేనని అధికారులు స్పష్టం చేశారు.
వరుస పేలుళ్ల దృష్ట్యా శ్రీలంకవ్యాప్తంగా భద్రతను పటిష్ఠం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగానే విమానాశ్రయం సమీపంలో బాంబును గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
బాంబు దాడులు జరిగినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కొలంబో విమానాశ్రయం కార్యకలాపాలు సాగిస్తోంది.
ఆరుగురు భారతీయులు...
శ్రీలంక పేలుళ్ల ఘటనలో మృతల సంఖ్య 290కి చేరింది. మరో 500మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఆరుగురు భారతీయులున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు.
ఇదీ చూడండి: 1971లో అద్భుత అవకాశం వదులుకున్నారు: మోదీ