కశ్మీరీలకు సహాయం చేసేందుకు ఎందాకైనా వెళ్తామని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దుపై స్పందించింది పాక్ సైన్యం. కశ్మీర్ అంశమై ఆర్మీ ప్రధాన కార్యాలయంలో పాక్ సైన్యం ప్రధాన అధికారులు సమావేశమయ్యారు.
"పాకిస్థాన్ ఆర్మీ కశ్మీరీలకు చేయూతగా ఉండే అంశంలో స్థిరంగా నిలబడతాం. మా లక్ష్యం కోసం ఎంతదాకానైనా వెళ్తాం."
-జనరల్ ఖమార్ జావేద్ భజ్వా, పాక్ ఆర్మీ చీఫ్
కశ్మీర్‌కు సంబంధించి భారత చర్యలను తిరస్కరిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పాక్ ఆర్మీ తన ప్రకటనలో గుర్తు చేసింది. ఆర్టికల్-370, ఆర్టికల్ 35ఏలను పాకిస్థాన్ ఎప్పుడూ గుర్తించలేదని వ్యాఖ్యానించింది.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై మోదీ హిట్... కాంగ్రెస్ 'హిట్ వికెట్'