అమెరికాతో ఉత్తరకొరియా చర్చలకు సిద్ధంగా ఉందని వచ్చిన వార్తల్ని..ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కొట్టిపారేశారు. ఈ విషయంలో అమెరికా పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.
అమెరికాతో చర్చలకైనా, పోట్లాటకైనా సిద్ధమేనని..ఎక్కువగా ఘర్షణకే సిద్ధమని ఉత్తరకొరియా అధ్యక్షుడు అన్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ మంగళవారం అన్నారు. చర్చలకు సిద్ధం అనడాన్ని మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు.
అయితే అమెరికాతో చర్చలపై ఉత్తర కొరియా నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు యూఎస్ తరపు నార్త్ కొరియా వ్యవహారాల రాయబారి సంగ్ కిమ్ అన్నారు.