ETV Bharat / international

'మాటలు జాగ్రత్త'- కొరియాకు​ కిమ్​ సోదరి వార్నింగ్ - ఉత్తర కొరియా కరోనా కేసులు

తమది 'కరోనా ఫ్రీ' దేశమని ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై ఇటీవలే అనుమానం వ్యక్తం చేసింది దక్షిణ కొరియా. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ సోదరి విరుచుకుపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దక్షిణ కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి​ వస్తుందని కిమ్​ యో జాంగ్​ హెచ్చరించారు.

Kim's sister slams Seoul over questioning zero-virus claim
'మాటలు జాగ్రత్త'- కొరియాకు​ కిమ్​ సోదరి వార్మింగ్​
author img

By

Published : Dec 9, 2020, 1:27 PM IST

దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ సోదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమది కరోనా ఫ్రీ దేశమని ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై అనుమానం వ్యక్తం చేస్తూ దక్షిణ కొరియా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దక్షిణ కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కిమ్​ యో జాంగ్​.

ఉత్తర కొరియాలో కరోనా కేసులు లేవంటే నమ్మడం చాలా కష్టంగా ఉందని ఇటీవలే ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి కాంగ్​ క్యూంగ్​. కరోనా సంక్షోభంలో సహాయం చేస్తామన్న తమ ప్రతిపాదనపై కిమ్​ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- కిమ్​ జోంగ్​ చెల్లెలు అంత శక్తిమంతమా?

ఈ వ్యవహారంపై కిమ్​ యో జాంగ్​ మండిపడ్డారు.

"ఈ వ్యాఖ్యలు నిర్లక్ష్యంతో కూడినవి. తదుపరి పరిణామాలను ఆలోచించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర-దక్షిణ కొరియా మధ్య ఇప్పటికే క్షీణించిన సంబంధాలను మరింత బలహీనపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్​ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మాటలను మేము ఎప్పటికీ మర్చిపోము. దీని ఆమె మూల్యం చెల్లించుకునే సందర్భం కూడా వచ్చే అవకాశముంది."

--- కిమ్​ యో జాంగ్​, ఉత్తర కొరియా అధినేత సోదరి.

అనేక మంది ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాలో ఇప్పటికే ఆరోగ్య వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందని.. కరోనా వంటి వ్యాధులు అక్కడ విస్తరిస్తే పరిస్థితులు ఊహించని విదంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:- కరోనా అంటే కిమ్‌కు ఎందుకంత భయం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.