ఉత్తర కొరియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆహార కొరత ఆందోళనకరం..
మంగళవారం జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కిమ్ ఆదేశించారు. దేశంలో నెలకొన్న ఆహార కొరత.. ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే గతేడాదితో పోలిస్తే.. పరిశ్రమల్లో ఉత్పత్తి 25 శాతం పెరిగిందన్నారు.
2018లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అమెరికా ఆంక్షలను కఠినతరం చేసింది. మరోవైపు చైనాతో సరిహద్దు వివాదంతో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది.
అసలే అంతంత మాత్రంగా ఉన్న ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ.. కరోనా, లాక్డౌన్ వల్ల పూర్తిగా దెబ్బతిన్నది. తుపాను, వరదల కారణంగా పంటలు ధ్వంసమయ్యాయి.
ఇదీ చదవండి : Wuhan lab: కరోనాపై నోరువిప్పిన వైరాలజిస్ట్