ETV Bharat / international

'కోమాలోకి ఉత్తర కొరియా అధినేత కిమ్' - కోమాలోకి కిమ్ జోంగ్

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లినట్లు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి సహచరుడు వ్యాఖ్యానించారు. కొంతకాలంగా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Kim Jong-un 'in coma': diplomat claims
'కోమాలోకి వెళ్లిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్'
author img

By

Published : Aug 24, 2020, 3:15 PM IST

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు. తన సోదరి కిమ్ యోంగ్ ఉన్​కు కొన్ని అధికారాలు కట్టబెట్టిన అనంతరం ఆయన ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డై జంగ్ సహచరుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. తీవ్రంగా జబ్బుపడి మరణించారన్న కథనాలు కూడా వచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత ఓ ఫ్యాక్టరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయినప్పటికీ ఈ వదంతులకు అడ్డుకట్టపడలేదు. కిమ్ సోదరి ఆయన తరపున అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.