ETV Bharat / international

'పాక్​ ప్రథమ ప్రాధాన్యం 'కశ్మీర్​' మాత్రమే' - ఆర్టికల్ 370 రద్దు

కశ్మీర్​.. తమ ప్రథమ ప్రాధాన్య అంశమని పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తాలని ఆయన నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

'పాక్​ ప్రథమ ప్రాధాన్యం 'కశ్మీర్​' మాత్రమే'
author img

By

Published : Aug 21, 2019, 8:41 AM IST

Updated : Sep 27, 2019, 5:59 PM IST

'పాక్​ ప్రథమ ప్రాధాన్యం 'కశ్మీర్​' మాత్రమే'

పాకిస్థాన్ ప్రథమ ప్రాధాన్యం కశ్మీరే అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ వ్యాఖ్యానించారు. మంగళవారం తన మంత్రివర్గంతో సమావేశమైన ఇమ్రాన్​.. సెప్టెంబర్​లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించారు.​

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్​ 27న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే సమయంలో కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తి, భారత్​ను ఇరుకున పెట్టాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఇమ్రాన్​ఖాన్​ ప్రత్యేక కార్యదర్శి ఫిర్దౌస్ ఆశిక్ అవన్ స్పష్టం చేశారు.​ కశ్మీర్​లో భారత్ విధించిన ఆంక్షలను ఎత్తివేయకపోతే.. అంతర్జాతీయ వేదికల్లో ఆ అంశాన్ని తప్పక ప్రస్తావిస్తామని ఆమె స్పష్టం చేశారు.

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లాలని పాక్​ నిర్ణయించుకుందని ఫిర్దౌస్ ఆశిక్ అవన్​ తెలిపారు.

పాక్... అనవసర జోక్యం

భారత్​... జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ విషయంపై పాకిస్థాన్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. అయితే ఇది భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సంఘానికి భారత్ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: గాంధీ 150: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.