ETV Bharat / international

నేపాల్​ ప్రధానిగా మరోమారు ఓలీ ప్రమాణం - కేపీ శర్మ ఓలీ తాజా వార్తలు

నేపాల్​ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ దేశ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ ప్రమాణం చేయించారు.

K P Sharma Oli
నేపాల్​ ప్రధాని
author img

By

Published : May 14, 2021, 3:17 PM IST

Updated : May 14, 2021, 3:31 PM IST

నేపాల్​ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ.. శుక్రవారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్​లో విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కొద్ది రోజులకే ఆయన మళ్లీ ప్రధాని పదవి చేపట్టడం గమనార్హం. శీతల్​ నివాస్​ వద్ద జరిగిన కార్యక్రమంలో కేపీ శర్మతో ఆ దేశ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ ప్రమాణం చేయించారు.

నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను ప్రతిపక్షాలు మెజార్టీ సాధించలేక విఫలమవ్వగా.. కేపీ శర్మ ఓలీకే మరోసారి ప్రధానిగా అవకాశమిచ్చారు అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ. నేపాల్​ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోగా కేపీ శర్మ ఓలీ.. విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది.

అంతకుముందు.. 2015, అకోబర్​ 11 నుంచి 2016, ఆగస్టు 3 వరకు, అనంతరం.. 2018 ఫిబ్రవరి 15 నుంచి 2021 మే 13 వరకు నేపాల్​ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇదీ చూడండి: హ్యాకర్లతో కుదరని బేరం- పోలీసుల వ్యక్తిగత డేటా లీక్!

Last Updated : May 14, 2021, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.