ETV Bharat / international

గేమ్​ ఆఫ్ థ్రోన్స్​, బీబర్​తో ప్రకృతికి ముప్పు! - ఐ విల్​ షో యూ

ప్రముఖ పాప్​ సింగర్​ జస్టిన్​ బీబర్​ 'ఐ విల్​ షో యూ' పాటలో మెరిసిన ఐస్​లాండ్​లోని 'జాద్రాల్​జుఫర్​ కాన్యాన్​'కు సందర్శకుల తాకిడి ఎక్కువవుతోంది. కాలినడక మార్గాలను మూసివేసినప్పటికీ యాత్రికులు వస్తున్నారు. ఫలితంగా ఇక్కడి వృక్ష సంపద దెబ్బతింటోందని అధికారులు చెబుతున్నారు.

ఐస్​లాండ్​లోని 'జాద్రాల్​జుఫర్​ కాన్యాన్​'
author img

By

Published : May 21, 2019, 1:56 PM IST

ఐస్​లాండ్​లోని 'జాద్రాల్​జుఫర్​ కాన్యాన్​'

2015లో కెనడా ప్రముఖ పాప్​ సింగర్​ జస్టిన్​ బీబర్​ విడుదల చేసిన 'ఐ విల్​ షో యూ' పాట గుర్తుంది కదా... అందులో అందరికీ కనువిందు చేసిన ప్రకృతి రమణీయ దృశ్యాలను అంత తొందరగా ఎవరూ మరచిపోలేరు. ఈ పాట కారణంగా ఇప్పుడు దక్షిణ ఐస్​లాండ్​లోని 'జాద్రాల్​జుఫర్​ కాన్యాన్​' సుందర ప్రాంతాన్ని చూసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

విన్యాసాలు చేయాలని..

పాట చిత్రీకరణలో భాగంగా కొండ చివరి అంచుల్లో జస్టిన్​ బీబర్​ చేసిన విన్యాసాలను తామూ చేయాలని... ప్రభుత్వ హెచ్చరికలను సైతం పెడచెవిన పెడుతున్నారు. లోయ చివరకు వెళ్లడం ప్రమాదకరమని చెప్పినా పట్టించుకోవట్లేదు. అంతేకాదు పెద్ద సంఖ్యలో వస్తున్న యాత్రికులతో అక్కడి వృక్షసంపద దెబ్బతింటున్న కారణంగా కాలినడక మార్గాలను మూసివేశారు అధికారులు. అయినప్పటికీ జాద్రాల్​జుఫర్​ కాన్యాన్​కు సందర్శకుల తాకిడి తగ్గలేదు.

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ ఇక్కడే..

జస్టిన్​ బీబర్ లాగా పచ్చిక కొండల అంచుల్లో కూర్చుని ఫోటోలు దిగేందుకు, ఇక్కడి నదిలోని చల్లని నీటిలో కాసేపు జలకాలు ఆడేందుకు అక్కడి కాపలాదారుడికి లంచాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు పర్యటకులు. ప్రముఖ వెబ్​ సిరీస్​ 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్​ ఇక్కడే చిత్రీకరించడం... యాత్రికుల తాకిడికి మరో కారణం.

కూలిన ఎయిర్​క్రాఫ్ట్​ను చూసేందుకు..

సోహీమసాండర్​లోని బ్లాక్ ​బీచ్​లో అమెరికా నేవీకి చెందిన డగ్లాస్​ డీసీ-3 ఎయిర్​క్రాఫ్ట్​ 1973లో ఇక్కడ కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఏడుగురు అమెరికన్లు ప్రాణాలతో బటయపడ్డారు. అయితే ఎయిర్​క్రాఫ్ట్​ను మాత్రం అక్కడి నుంచి తొలగించలేదు. ఈ విమానాన్ని చూసేందుకూ వస్తున్నారు పర్యటకులు.

ప్రతి ఏడాది 20శాతం పెరుగుదల

2015లో జస్టిన్​ బీబర్​ 'ఐ విల్​ షో యూ' పాటను యూట్యూబ్​లో విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదపు 440 మిలియన్ల​ మంది ఈ పాటను వీక్షించారు. దాదాపు 10 లక్షల మంది 'జాద్రాల్​జుఫర్​ కాన్యాన్​'ను సందర్శించారు.

ప్రతి ఏడాది 20 శాతం పర్యటకులు పెరుగుతున్నారు. ఇక్కడి మౌలిక సదుపాయాలు వారందరికీ సరిపోవట్లేదు. ఫలితంగా ఇక్కడి సహజసిద్ధ వనరులు దెబ్బతింటున్నాయని అధికారులు తెలిపారు.

Intro:Body:

dot amazon

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.