భారత్-చైనా దేశాల మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుని, శాంతి సుస్థిరతలను నెలకొల్పాలని చైనా రాయబారి సన్ ఉయ్డోంగ్ ఆకాంక్షించారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. రెండోసారి అనధికారంగా భేటీ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్, చైనాలు సానుకూల దృక్పథంతో వ్యత్యాసాలను, విభేదాలను దాటి.. అభివృద్ధి దిశగా కలిసి అడుగులు వేయాలని ఉయ్డోంగ్ అన్నారు.
ఇరుగుపొరుగు అన్నాక సహజమే
పరస్పర రాజకీయ విశ్వాసాలు, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం దిశగా మోదీ-జిన్పింగ్ చర్చలు జరుపుతారని ఉయ్డోంగ్ తెలిపారు. ఇరుగుపొరుగు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు సాధారణమేనని.. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడమే ఉత్తమం అని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదం.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపాలని తాము కోరుకోవడంలేదని ఆయన వివరించారు.
ఇదీ చూడండి: రావణుడికి విల్లు ఎక్కిపెట్టిన ప్రధాని మోదీ