Japanese billionaire space tour: జపాన్ బిలియనీర్, ఫ్యాషన్ రంగ దిగ్గజం యుసాకు మెజవా అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపిన అనంతరం.. భూమికి తిరుగువచ్చారు. మెజవాతో పాటు ఆయన ప్రొడ్యూసర్ యొజో హిరానో, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ మిసుర్కిన్ సైతం సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యారు. కజకిస్థాన్‌లోని జెజ్కాగన్ ప్రాంతానికి 148 కి.మీ దూరంలో సోమవారం ఉదయం 8.43 గంటలకు దిగారు.
Japan billionaire returned earth
2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్ష పర్యటనకు వెళ్లిన వ్యక్తులుగా మెజవా, హిరానో రికార్డు సృష్టించారు. అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు 'ఉబర్ ఈట్స్' సంస్థ ఆహార పదార్థాలను పంపించగా.. మెజవా వాటిని చేరవేశారు.
చందమామ యాత్ర సైతం..
చంద్రుడిపైకి వెళ్లేందుకూ మెజవా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు 'డియర్ మూన్' అని పేరు పెట్టారు. 2023లో ఈ మిషన్‌ను చేపట్టనున్నారు. స్టార్ షిప్ రాకెట్లో చంద్రుడి మీదకు వెళ్లే తొలి ప్రయాణికుడిగా మిజవా పేరును 2018లోనే ప్రకటించారు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్. ఇది సాకారమైతే 1972 తర్వాత తొలి చంద్రుని యాత్రగా రికార్డుకెక్కనుంది.
స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్లో చంద్రుడి మీదకు వెళ్లేందుకు ఎనిమిది మందిని ఆహ్వానించారు మెజవా. ఇందుకోసం ఓ కాంటెస్ట్ ప్రారంభించారు. పోటీలో గెలిచిన వారి యాత్రకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరించనున్నట్లు తెలిపారు. ఇందులో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఎంపిక ప్రక్రియ గురించి ఈ మెయిల్ వస్తుందని వివరించారు.
ఇదీ చదవండి: