ETV Bharat / international

జపాన్​ నౌకలో మరొకరు మృతి... తాజాగా 57మందికి కరోనా

జపాన్​ నౌకలో కరోనా బారిన పడి మరొకరు మృతి చెందారు. ఇంకో 57 మందికి వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు జపాన్​ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Japan reports 3rd cruise ship death, 57 more infected
జపాన్​ నౌకలో మరొకరు మృతి... తాజాగా 57మందికి కరోనా
author img

By

Published : Feb 24, 2020, 6:14 AM IST

Updated : Mar 2, 2020, 8:57 AM IST

జపాన్ నౌకలో కొవిడ్​-19 బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు ఆ దేశ​ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకంటించింది. తాజాగా మరో 57 మందికి వ్యాధి సోకినట్లు వైద్యుల నిర్ధరించారు.

నౌకలో కొత్త కేసులతో సహా ఇప్పటివరకు 691మంది కరోనా బారిన పడ్డారు. జపాన్​లో మొత్తం 826 మంది కొవిడ్​-19 బారిన పడగా.. నలుగురు మృతి చెందారని ప్రభుత్వం​ ప్రకటించింది.

జపాన్​ తీరంలోని నౌకలో కరోనా వైరస్​తో ముగ్గురు మృతిచెందారు. వీరు 80ఏళ్లు పైబడిన వృద్ధులుగా ఆ దేశ మీడియా పేర్కొంది. వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరగడమే కాకుండా మృతుల సంఖ్య పెరుగుతుండటం వల్ల నౌకలో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 78 వేల మందికి కరోనా- ఏ దేశంలో ఎంత మంది?

Last Updated : Mar 2, 2020, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.