ETV Bharat / international

చైనా దురాక్రమణలపై జపాన్​ నిరసన

చైనా దురాక్రమణలపై జపాన్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ జపాన్​ పర్యటనలో భాగంగా ఈ అంశంపై నిరసన వ్యక్తం చేసింది. జపాన్​ అధీనంలోని తూర్పు చైనా సముద్రంలోని ద్వీపాల్లో ఎలాంటి కార్యచరణ చేపట్టకూడదని స్పష్టం చేసింది.

Japan protests_china
చైనా చొరబాట్లపై జపాన్ అసంతృప్తి
author img

By

Published : Nov 26, 2020, 5:30 AM IST

తూర్పు చైనా సముద్రంలోని ద్వీపాల విషయంలో చైనాపై అసంతృప్తి వ్యక్తం చేసింది జపాన్​. ఈ మేరకు.. చైనా విదేశాంగ మంత్రి జపాన్​ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని లేవనెత్తింది.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పాటు జపాన్​లో​ పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు దుందుడుకు చర్యలను నివారించాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవలి కాలంలో చైనా-జపాన్​ల మధ్య చాలా మేరకు ఒప్పందాలు కుదిరాయి. కానీ, ప్రాదేశీక భూభాగాల విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే.. విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. వ్యాపార సంబంధాల్లోనూ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

జపాన్​ అధీనంలో ఉన్న తూర్పు చైనా సముద్ర ద్వీప ప్రాంతాన్ని సెంకాకు అంటారు. దీన్ని చైనా డియోయు అని పిలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో చైనా తమ కోస్ట్​ గార్డ్ నౌకలతో వివిధ కార్యకలాపాలు నిర్వహించింది. జపాన్​ అధికారులు ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించినా చైనా ఈ చర్యకు పాల్పడడం గమనార్హం.

ఇదీ చదవండి:ప్రపంచంలో 6 కోట్లు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.