జపాన్ తీరంలో నిలిపివేసిన ఓడలోని ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నౌకలోని ప్రయాణికులకు 2 వేల యాపిల్ ఫోన్లను అందించింది అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఒక్కో క్యాబిన్‌కు ఒక్కో ఫోన్‌ను కేటాయించింది.
యాప్ కోసమే...
జపాన్ ఆరోగ్య శాఖకు చెందిన హెల్త్ యాప్.. ఆ దేశంలో రిజిస్టర్ అయిన ఫోన్లలోనే పనిచేస్తుంది. నౌకలోని ప్రయాణికులు యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు తెలియజేయాలంటే.. జపాన్‌లో రిజిస్టర్ అయిన ఫోన్ తప్పనిసరి. ఈ కారణంగా ప్రయాణికులకు ఐఫోన్లను అందించింది.
130 మందికి కరోనా...
జపాన్ నౌకలో ఇప్పటి వరకు 218 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. నౌకలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ప్రయాణికులకు ఇచ్చిన ఫోన్లు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
నౌకలో మొత్తం 3,711 మంది ఉన్నారు. హాంకాంగ్‌లో దిగిన ఓ వ్యక్తి నుంచి నౌకలోని వారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఫలితంగా అప్పటి నుంచి నౌకను నిర్బంధంలో ఉంచారు. నౌకలో ఉన్న వారిలో ముగ్గురు భారతీయులు సహా 218 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఇద్దరు ఫేస్బుక్ రారాజులు త్వరలో కలవబోతున్నారు!