ETV Bharat / international

జపాన్​లో వరదల బీభత్సం.. 58 మంది మృతి - జపాన్​లో వరద బీభత్సం

జపాన్​లో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. తీవ్ర స్థాయిలో కురుస్తోన్న వర్షాల కారణంగా నదుల ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. వరదల్లో చిక్కుకొని ఇప్పటివరకు ఆ దేశంలో 58 మంది మరణించగా.. 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Japan battered by more heavy rain, floods; 58 dead
జపాన్​లో వరదల బీభత్సం.. 58 మంది మృతి
author img

By

Published : Jul 9, 2020, 5:46 AM IST

జపాన్​లో కురుస్తోన్న భారీ వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరదల బీభత్సానికి ఇప్పటివరకు ఆ దేశంలో 58 మంది మృతిచెందారు. దక్షిణ జపాన్​లో ప్రారంభమైన ఈ వర్షాలు.. ఈశాన్య దిశగా పయనిస్తూ జపాన్​ ద్వీపంపై ప్రభావం చూపుతున్నాయి. నదుల్లో భారీస్థాయిల్లో బురదనీరు ప్రవహిస్తున్న కారణంగా.. అక్కడి ఇళ్లు, రోడ్లు పూర్తిగా జలమయ్యాయి.

వరదల బీభత్సానికి సుందరమైన పర్వత మార్గాలు నీట మునిగాయి. నాగానోలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలైన కామికోచి, మాట్సుమోటోలలో ప్రధాన రోడ్లపై బురదనీరు పేరుకుపోయింది. ఫలితంగా ఆ మార్గాలను మూసివేయడం వల్ల.. వందలాది మంది స్థానికులు, సందర్శకులు అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 14 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా పదివేల సైనిక బలగాలు, పోలీసులు సహా రెస్క్యూ టీమ్​ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

చైనా గాలుల కారణంగా..

తూర్పు చైనా సముద్రం నుంచి వీస్తోన్న చలి, వేడి గాలుల కారణంగా.. వేసవికాల ప్రారంభానికి ముందే జపాన్​ భారీ వరదలకు గురయ్యే ప్రమాదముందని అక్కడి అధికారులు హెచ్చరించారు. 2018 జులైలో సంభవించిన వరదల కారణంగా ఆ దేశంలో 200 మందికిపైగా మరణించారు.

ఇదీ చదవండి: జపాన్​లో వరద బీభత్సం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.