ETV Bharat / international

' భారత్​-పాక్ గతాన్ని వీడి ముందుకు సాగాలి'

భారత్​-పాక్​ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా. తూర్పు, పశ్చిమ ఆసియా మధ్య సంబంధాలు, దక్షిణ, మధ్య ఆసియా సామర్థ్యాన్ని అన్‌లాక్‌ చేయడానికి స్థిరమైన ఇండో-పాక్‌ సంబంధాలు కీలకమని చెప్పారు. కశ్మీర్‌లో అనుకూలమైన వాతావరణాన్ని పొరుగుదేశం సృష్టించవలసి ఉంటుందని భారత్‌ను ఉద్దేశించి అన్నారు.

It's time for Pak and India to 'bury the past and move forward', says Gen Bajwa
' భారత్​-పాక్ గతాన్ని వీడి ముందుకు సాగాలి'
author img

By

Published : Mar 19, 2021, 5:55 AM IST

భారత్‌-పాకిస్థాన్‌లు గతాన్ని వీడి ఐక్యంగా ముందుకు సాగాలని పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా వ్యాఖ్యానించారు. తూర్పు, పశ్చిమ ఆసియా మధ్య సంబంధాలు, దక్షిణ, మధ్య ఆసియా సామర్థ్యాన్ని అన్‌లాక్‌ చేయడానికి స్థిరమైన ఇండో-పాక్‌ సంబంధాలు కీలకమని ఆయన చెప్పారు.

కశ్మీర్‌లో అనుకూలమైన వాతావరణాన్ని పొరుగుదేశం సృష్టించవలసి ఉంటుందని భారత్‌ను ఉద్దేశించి అన్నారు. వివిధ శక్తుల మధ్య విచ్చలవిడి సంబంధాలు చివరికి మరొక ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తాయని వ్యాఖ్యానించారు.

దక్షిణ ఆసియాలో ఈ పరిష్కరించని సమస్యలే మొత్తం ప్రాంతాన్ని తిరిగి పేదరికం, అభివృద్ధి చెందని స్థితిలోకి లాగుతున్నాయని జనరల్‌ బజ్వా అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : 'బైడెన్​ వ్యాఖ్యలు అమెరికా గత చరిత్రకు నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.